PoliticalTelanganaYadadri

ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత సహాయకుడి అనుమానాస్పద మృతి...

ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత సహాయకుడి అనుమానాస్పద మృతి...

ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత సహాయకుడి అనుమానాస్పద మృతి…

తెలంగాణ రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసంలోని మూడో అంతస్తులో ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఇంట్లో పని చేసే వ్యక్తి గంధమల్ల రవి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

ఎమ్మెల్యే ఇంటిపై వుండే పెంట్ హౌసులో ఎవరూ లేని సమయంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇతడి వయసు 38 ఏళ్లు. ఎమ్మెల్యే ఇంటిపైన పెంట్ హౌసులో తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివశిస్తున్న రవి ఇటీవలే తన సొంత ఊరు వెళ్లివచ్చాడు.

శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చిన రవి అదేరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో విషయమై ఎమ్మెల్యే సన్నిహితుడు రవిపై విరుచుపడినట్లు చెప్పుకుంటున్నారు. ఇది జరిగిన వెంటనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

బలవంతంగా ప్రాణాలు తీసుకునేంత భయంకరమైన కారణం ఏంటా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా రవి మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

రవి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రవి తల్లిదండ్రులు తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదనీ, తన కుమారుడు చావు వెనుక ఏదో బలమైన కారణం వుందని అంటున్నారు. దీనితో ఇప్పుడు ఆ బలమైన కారణం ఏంటా అని పలువురు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button