NizamabadPoliticalTelangana

భార్యను పనిలో దించి వస్తుండగా భర్త అనంత లోకాలకు

భార్యను పనిలో దించి వస్తుండగా భర్త అనంత లోకాలకు

భార్యను పనిలో దించి వస్తుండగా భర్త అనంత లోకాలకు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద సంఘటన సంభవించింది.

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ ఏరియాలోని 6 వ మున్సిపల్ వార్డు కు చెందిన మామిడి మహేష్ ఆయన భార్య మామిడి లావణ్య నిర్మల్ రోడ్డులో గల మహిళా ప్రాంగణంలోని కస్తూర్బా పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట తయారీ పనులు చేస్తుంది.

ఆ పాఠశాలలో మామిడి మహేష్ ఆయన భార్య మామిడి లావణ్యను పనికి వెళ్లేందుకు అక్కడ దించి వస్తుండగా కోటార్మూర్ ఏరియాలోని 63 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించి మహేష్ (38) అనంతలోకాలకు పయనమయ్యాడు.

జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన టీఎస్ 21 టి 5517 ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి కోటార్ మూర్ మీదుగా నిజామాబాద్ వైపు వెళ్తుండగా కోటార్మూర్లోని హనుమాన్ టెంపుల్ ఏరియాలో బైక్ పై వస్తున్న మహేష్ ను ఢీ కొట్టింది.

ఈ రోడ్డు ప్రమాద ఘటనలో తీవ్రంగా తలకు భారీ గాయం కావడంతో మామిడి మహేష్ కు తీవ్ర రక్తస్రావం అయింది. రోడ్డు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన సమీప బంధువులు మహేష్ ను సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు.

రోడ్డు ప్రమాద సంఘటనను ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్సై రమేష్ లు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button