
విటుడితో వ్యభిచారి గొడవ.. కేపీహెచ్బీలో కత్తులతో దాడి
హైదరాబాద్లోని కేపీహెచ్బీ రోడ్ నంబర్-1లో సాధారణంగా కుటుంబాల కబుర్లు, ఉద్యోగుల హడావుడి వుండే సమయంలో.. మంగళవారం అర్ధరాత్రి షాకింగ్ ఘటన జరిగింది. ఒక మహిళ, పురుషుని మధ్య మాటల తగవుతో మొదలైన ఘర్షణ కత్తులతో దాడిచేసుకునే వరకు చేరింది. ఎవరికీ అర్థం కానంత వేగంగా జరిగిన ఈ సంఘటన చూసిన వారందరినీ షాక్కు గురిచేసింది.
అసలు గొడవేంటి?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యభిచారినితో బుక్ చేసుకునే సమయంలో విటుడితో వాగ్వాదానికి దిగింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ఆ విటుడు, మహిళ మధ్య వాగ్వాదం క్షణాల్లో ఘర్షణకు దారితీసి తీవ్ర స్థాయికి చేరింది. ఆ మహిళ తన బంధువుకు ఫోన్ చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
కొద్ది నిమిషాల్లోనే అతడు తన స్నేహితులు, అనుచరులతో అక్కడికి చేరుకుని పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చాడు. చుట్టుపక్కలున్న వారు ఏమి జరుగుతుందో అర్థం చేసుకునేలోపే వాతావరణం వేడెక్కి పోయింది.
ఆగ్రహంతో విరుచుకుపడిన గ్యాంగ్ సభ్యులు ఆ ఉద్యోగిపై కత్తులతో దాడి చేశారు. కత్తుల దాడులు, అరుపులతో అక్కడి దృశ్యాలు సినిమా ఫైట్ లా మారిపోయింది.
ప్రాణభయంతో స్థానికులు తమ ఇళ్లలోకి పరుగులు తీశారు. రక్తస్రావంతో రోడ్డు మీద కుప్పకూలిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. నగరంలో శాంతిభద్రతలతో చెలగాటమాడే వారిని విడిచిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు.