PoliticalsuryapetaTelangana

పట్టపగలు చైన్ స్నాచింగ్.. పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగులు

పట్టపగలు చైన్ స్నాచింగ్.. పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగులు

పట్టపగలు చైన్ స్నాచింగ్.. పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగులు

నడిగూడెం : పట్టపగలు చైన్ స్నాచింగ్.. వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామానికి 100 మీటర్ల దూరంలో గల పొలం వద్దకు వెళ్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్లిన ఘటన ఆదివారం మండలంలోని కాగిత రామచంద్రాపురంలో చోటు చేసుకుంది.

బాధితురాలు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం గ్రామానికి చెందిన జంగిళి వీరమ్మ ఊరు చివరన గల సొంత వ్యవసాయ పొలంలో పని చేసేందుకు మధ్యాహ్నం ఒంటరిగా వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వెంబడించి మహిళ మెడలోని బంగారు గొలుసు చోరికి పాల్పడ్డారు.

ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న మహిళ ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ దుండగులు బలవంతంగా లాగడంతో బాధితురాలు కిందపడిపోయింది. దీంతో ఆమెకు స్వల్పగాయాల పాలైంది. పుస్తెలతాడు 30 గ్రాములు ఉంటుందని బాధితురాలు తెలిపింది.

దుండగులకు, బాధితురాలికి మధ్య జరిగిన పెనుగులాటలో మెడలోని గొలుసు మధ్యలో తెగి సుమారు 20 గ్రాముల తాడు చోరీ గురైందని ఆవేదన వ్యక్తం చేసింది.

రెండు చోరీలు జరగడంతో పోలీసులు..? స్థానికులు సమాచారంతో నడిగూడెం ఎస్సై గంధమళ్ల అజయ్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు అడిగి తెలుకుని, సదరు మహిళ ఫిర్యాదు మేరకు స్వీకరించి,

ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఘటన స్థలాన్ని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, సూర్యాపేట సీసీఎస్ పోలీసులు పరిశీలించి వివరాలు తెలుకున్నారు.

ఇదే గ్రామంలో గత నెల 27 అర్ధరాత్రివేళ స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో నిద్రిస్తున్న తిరుపతమ్మ మాలధారులకు చెందిన మూడు మొబైల్ ఫోన్లు కూడా చోరీకి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గుడిలోని సీసీ కెమెరాల చోరీకి నమోదైనట్లు వారు చెప్పారు.

పట్టపగలు ఊరి సమీపంలో బంగారం గొలుసు అపహరణకు గురికావడం, గ్రామ నడిబొడ్డున గల దేవాలయంలో నిద్రిస్తున్న స్వాముల సెల్ ఫోన్లు చోరీకి గురికావడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారంలో రెండు చోరీలు జరగడంతో రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button