BadradriTelangana

గంజాయి అక్రమ రవాణా కేసులో నల్గురికి శిక్ష ఖరారు

గంజాయి అక్రమ రవాణా కేసులో నల్గురికి శిక్ష ఖరారు

గంజాయి అక్రమ రవాణా కేసులో నల్గురికి కఠిన కారగార శిక్ష.

సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),

మే 04,

కొత్తగూడెం లీగల్ గంజాయి అక్రమ రవాణా కేసులో నల్గురికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సేషంట్స్ జడ్జ్ (స్పెషల్ జడ్జ్ ఎన్ డి పి ఎస్ యాక్ట్ )గురువారం ఎం. శ్యాం శ్రీ తీర్పు చెప్పారు. భద్రాచలం పోలీస్ వారు 28 అక్టోబర్ 2018 న వాహన చెకింగ్ చేస్తుoడగా సి ఆర్ పి ఎఫ్ క్యాoపు వద్ద కుంట నుండి హైదరాబాద్ వెళ్ళే ఏ పి ఎస్ ఆర్ టి సి ఆర్టీసీ విజయవాడ డిపో బస్సు నేo. ఏపీ 29 3554 లో 15 ప్యాకెట్ల గంజాయి 69 కిలోల గంజాయి వాటి విలువ రు. 3,45,000/- ఏడుగురు నేరస్తులను పట్టుకొని విచారించగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్ గిరికి చెందిన గోపాల్ మండల్, దీపాంకర్ యస్ నామా, సంతోష్ సర్కార్, హైదరాబాద్ కు చెందిన అలీ ఖాన్,రాజీవ్ కుమార్ పటేల్, పులిమెట్ల చింతంగిపల్లి కి చెందిన స్వామి సర్కార్, మల్కాన్ గిరి కి చెందిన సమూలీ ముండా లను విచారించగా వారు నేరము ఓప్పుకున్నారని పంచనామా ద్వారా ఆట్టి గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసి అప్పటి భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ జి.యేసోబుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నాడు .అప్పటి ఇన్స్పెక్టర్లు పి. సత్య నారాయణ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేయగా, అప్పటి ఇన్స్పెక్టర్ కే. వినోద్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు .కోర్టులో 08 సాక్షులను విచారించారు. (ఏ5 కు రాజీవ్ కుమార్ పటేల్ కు 2023 ఫిబ్రవరి 28న ఈ కోర్టులో 10 సంవత్సరముల కఠినకారకార శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించారు). ఈ రోజున గోపాల్ మండల్, దీపాంకర్కర్ ఎస్ నామ, సంతోష్ సర్కార్, సమూలీ ముండాలకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల కఠిన గారగార శిక్ష మరియు ఒక లక్ష రూపాయలు జరిమానా నాల్గురికి విధిస్తూ తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమ్మరి రామారావు ప్రోసీక్యుషన్ నిర్వహించారు.లైజాన్ ఆఫీసర్ ఎం. హరి గోపాల్, భద్రాచలం కోర్టు డ్యూటీ ఏఎస్ఐ గంజి శశిధర్ సహకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected