PoliticalTelangana

గంజాయి అక్రమ రవాణా కేసులో ఒక్కరికి కఠిన కారగార శిక్ష

గంజాయి అక్రమ రవాణా కేసులో ఒక్కరికి కఠిన కారగార శిక్ష:

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

డిసెంబర్ 06,

గంజాయి అక్రమ రవాణా కేసులో ఒక్కరికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జ్ (స్పెషల్ జడ్జ్ ఎన్ డి పి ఎస్ యాక్ట్ ) బుధవారము ఎం. శ్యాం తీర్పు చెప్పారు. భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి. రామయ్య తమ సిబ్బందితో 10-07-2020 న భద్రాచలo, సబ్ జైలు వెనుక కరకట్ట వద్ద ఆగి ఉన్న కారుని చెకింగ్ చేస్తుoడగా రెనాల్ట్ నిషన్ డస్టర్ కారు నేo.ఏ పి. 09- సిఎన్ -3345 ఒరిస్సా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు హైదరాబాదులో అమ్ముకొని అధిక లాభాలకు అమ్ముదామని 219, 200 కేజీలు (రెండు వందల పందోమ్మిది కేజీల రెండు వందల గ్రాములు )గంజాయి ప్యాకెట్లు విలువ రు.రు.32,88,000/- దొరుకగా వరంగల్ జిల్లా శివ నగర్ కు చెందిన తోకల కుమారస్వామి నేరము ఓప్పు కున్నాడని, పంచనామా ద్వారా ఆట్టి గంజాయి ప్యాకెట్ల ను సీజ్ చేసి అప్పటి భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. వినోద్ కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నాడు ,

అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. స్వామి మరియు పి. నాగరాజు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో ఐదుగురు సాక్షులను విచారించారు.

తోకల కుమారస్వామి పై నేరo రుజువు కాగా, 12 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

.అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావి విజయకుమార్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.లైజాన్ ఆఫీసర్ ఎం. హరి గోపాల్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ భద్రాచలం టౌన్ ఏఎస్ఐ గంజి శశిధర్ లు సహకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button