
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేద్రం ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సి కె న్యూస్ ఏప్రిల్ 28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం అశ్వాపురం ప్రధాన రహదారి కూడలిలో ప్రస్తుతం మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని వివిధ పనుల మీద అశ్వాపురం వస్తున్న ప్రజల దాహం తీర్చేందుకు తమవంతు గా త్రాగడానికి మంచినీళ్లు అందించాలని సహృదయంతో చలివేద్ర కేంద్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ 320E గవర్నర్ శ్రీ తీగల మోహన్ రావు దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు.
అలాగే పంచాయతీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు, జొన్నరొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన బాణోత్ లక్ష్మణ్ కు నాలుగు చక్రాల తోపుడు బండి ని వితరణగా అందజేశారు,అలాగే అశ్వాపురం పంచాయితీ లో పనిచేసే మల్టీ పర్పస్ సిబ్బందికి చీరలు పంచిపెట్టారు, మండలంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా అశ్వాపురం లయన్స్ క్లబ్ సహాయ సహకారాలు అందించటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు ఎమ్.రత్నాకర్,కార్యదర్శి కమటం నరేష్,కోశాధికారి సరేశ్వరరావు,ఎమ్ జే ఎఫ్ సుంకరి సురేందర్,సభ్యులు జి.కేశవరెడ్డి,ఒర్రె వీరభద్రం,వర్మ,పర్వత నరేష్,కిలారు కొండలరావు,అశ్విని,ప్రశాంతి మరియు మణుగూరు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.