PoliticalTelangana

ఎమ్మెల్యే కందాల ముసలి కన్నీళ్లు నమ్మొద్దు.. పొంగులేటి

ఎమ్మెల్యే కందాల ముసలి కన్నీళ్లు నమ్మొద్దు.. పొంగులేటి

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం రూరల్ మండల ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కామెంట్స్

సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఓ దొర చేతిలో బందీ అయింది..

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, దొర చేతికి అప్పగించడానికి సామాన్య ప్రజానీకానికి మంచి చేయడానికి..

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ దొర ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తాడు..

ఎన్నికలు అయిపోతే సామాన్య ప్రజానీకం కష్టాలల్లో ఏనాడు పాలుపంచుకోడు..

ఎన్నికలప్పుడు మాత్రమే ఇంద్రలోకం చంద్రలోకం చూపించి మాయ మాటలు చెబుతాడు ఈ దొర..

ఈ దొర మాయమాటలకు మోసపోతే మళ్ళీ మనం గోస పాలవుతాం..

ఇందిరమ్మ రాజ్యంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని తెచ్చుకుందాం..

నిత్యం మీతోనే ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటా…

ఈనెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి మీ శీనన్న ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి..

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటివరకు ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నాడు…

దోచుకొని దాచుకున్న సొమ్ముతో అక్కడ రేవంత్ రెడ్డిని ఇక్కడ నన్ను ఓడించడానికి కోట్లు ఖర్చు చేస్తున్నాడు..

ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి ప్రజల కోసం బాధపడుతున్నట్లు కన్నీరు కార్చుతున్నారు..

ఒక వ్యక్తి కన్నీరు పెడుతున్నాడని ఆలోచిస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మనం ఆ కన్నీళ్లు భరించాల్సి వస్తుంది..

మీరు ఉన్నారనే ధైర్యంతోనే కేసీఆర్ ని ఎండగడుతున్న..

రేపు అసెంబ్లీలో తప్పకుండా అధికారపక్షంలో నేను ప్రతిపక్షంలో కేసీఆర్ ఉంటాడు..

అసెంబ్లీలో ప్రతిరోజు చేసిన తప్పులను నిగ్గదీసే కార్యక్రమం ఉంటది..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button