తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్ళను దీటుగా ఎదురుకోవడానికి సిద్దం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖలద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై తేదీ 11.02.2024 నాడు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో) ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు http://tswreis.ac.in (లేదా) http://tgtwgurukulam.telangana.gov.in () http://mjptbcwreis.telangana.gov.in (w)
http://tgcet.cgg.gov.in 0
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు
- అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ 18.12.2023 నుండి 06.01.2024 వరకు ఆన్లైన్లో రూ.100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకొనవచ్చును. ఒక ఫోన్ నెంబర్ ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును.
- అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టివారిపై
సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును.
- విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది.
- ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 180042545678 ని లేదా ప్రాస్పెక్టస్ లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు ఉ: 10:30 గం॥ల నుండి సా: 5:00 గం॥ల వరకు.
- 2023–2024 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. (విద్యార్థినీ / విద్యార్థులు ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ / స్టడీ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.)
మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలు సం/- Dr. ఇ. నవీన్ నికోలస్, ఐ.ఏ.యస్.కార్యదర్శి TSWREIS & చీఫ్ కన్వీనర్, VTG CET-2024