Khammam

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు, 50 వేలు జరిమానా

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు, 50 వేలు జరిమానా

సి కె న్యూస్ ప్రతినిధి

బాలికపై లైంగిక దాడి కేసు (పోక్సో)లో మామిడి పాపారావు 30 సం,, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ ఎఫ్ టి సి-II ఖమ్మం, వ న్యాయమూర్తి కె. ఉమాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సత్తుపల్లి మండలానికి చెందిన 7 ఏళ్ల బాలిక 2023 ఆగస్టు 13 న ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిపై సత్తుపల్లిమండలం, కొత్తూరు గ్రామానికి చెందిన మామిడి పాపారావు బాధిత బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో అమె ఏడుస్తూ తీవ్ర భయాందోళనకు గురై ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్నిచెప్పడంతో 2023 ఆగస్టు 13న స్ధానిక సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో బాలికతల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాస రాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయ మూర్తి నిందితులపై మోపిన నేరం రుజువు కావడంతో తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ మహ్మద్ ఐ ఆర్ ఎస్ ఏ డి వాదించారు.

విచారణ అధికారులు. అప్పటి ఏసీపీ రామానుజం, ప్రస్తుత ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమా రాణి,కోర్టు కానిస్టేబుల్ యం.రవి కుమార్ , కోర్టు లైజనింగ్ ఆఫీసర్, శ్రీకాంత్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button