PoliticalTelangana

మల్కాజ్ గిరి పార్లమెంట్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మంత్రి తుమ్మల

మల్కాజ్ గిరి పార్లమెంట్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి……

మల్కాజ్ గిరి పార్లమెంట్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి……

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి….

ఈ రోజు సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గంలోనీ 114 వ డివిజ న్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలో తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొని ప్రసంగించారు….

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ,కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేసి పేదప్రజల మనస్సులను కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకుంటుందనీ
రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలను గెలిపించుకోవడం ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావడానికి మనవంతు శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ,
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి జెండాలు మోసి కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలను గౌరవించుకుంటూనే కొత్త నాయకులు,కార్యకర్తలను పార్టీ లోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు….

ఈ కార్యక్రమంలో
కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండెట్ బండి రమేష్,కో ఆర్డినేటర్ సత్యం శ్రీరంగం, డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి గార్ల సమక్షంలో గంధం రాజు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బి.జే.పి, బి.ఆర్. ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు,
వారందరినీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు….

ఈకార్యక్రమంలో నియోజకవర్గం లోని ఏ, బి బ్లాక్, డివిజన్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు……

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button