
మీడియా అకాడమీ ఫెడరేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ కార్యానిర్వక అధ్యక్షులుగా చొప్పదండి జనార్దన్
మంచిర్యాల జిల్లాలో శనివారం జరిగిన సమావేశంలో మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి సుధాకర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడి నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జిల్లా నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని, నియామక పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా చొప్పదండి జనార్ధన్ – ఉత్తర తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షులు, కాగితం శ్రీనివాస్ – మంచిర్యాల జిల్లా కార్యదర్శి, రత్నం శంకర్ – జిల్లా ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
నియామక పత్రాలు అందుకున్న సభ్యులు మీడియా అకాడమీ బలోపేతానికి కృషి చేస్తామని, కమిటీలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మీడియా అకాడమీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు ఈసంపల్లి వేణు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి సుధాకర్, ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడి నరసయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎం. నారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు, బి. రాజ్‌కుమార్ జిల్లా అధ్యక్షులు, చిప్పకుర్తి ఐలయ్య జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.




