HyderabadPoliticalTelangana

అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం…

అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం…

అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం… సిట్టింగ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని పార్టీల కంటే బీజేపీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో కూడా నమ్మకం కలిగి.. సానుకూలత పెరిగిందని అన్నారు.

దేశాన్ని సమర్దవంతంగా ముందుకు తీసుకెళ్లే సత్తా మోడీకే ఉందని అందరిలోనూ ఆలోచన మొదలైందని తెలిపారు. రాష్ట్రంలో ఆగష్టు 15లోపు రుణమాఫీ చేయకుంటే.. సంక్షోభం తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ 12కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అనేక చోట్ల రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందని సెటైర్ వేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామన్నా బీఆర్ఎస్ ఎక్కడా కనిపించదు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ నియంత ధోరణే ఆ పార్టీని బొంద పెట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button