
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద పటిష్ట భద్రత.. పోలీసుల మొహరింపు
కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతేల్లి సమత భర్త రాజేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయినట్లు తెలిసింది.
ఎల్ఎండి కాలనీలోని మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు ఉదయం నుంచే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చే దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరుని పై ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన తెలిసిందే.
అయితే రాజేందర్ రెడ్డి మృతదేహాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు గాని గుండ్లపల్లి చౌరస్తా పై గాని వేసి ఆందోళన చేసేందుకు కుటుంబికులు సమాయత్తమవుతున్నారనే సమాచారం మేరకు ఈ రెండు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.




