Uncategorized
Trending

ఘోర ప్రమాదం కుప్పకూలిన హెలికాప్టర్

ఘోర ప్రమాదం కుప్పకూలిన హెలికాప్టర్

భారత్‌లో మరో ప్రమాదం.. ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌

అహ్మాదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది.

హెలికాప్టర్‌ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. సదరు హెలికాప్టర్‌ డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం హెలికాప్టర్‌ కూలిపోయింది. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ గౌరీకుండ్‌ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిని సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉండగా.. ఆరుగురు భక్తులు మృతిచెందారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మృతి చెందిన వారిలో ఒక చిన్నారి ఉన్నట్టు సమాచారం. వీరంతా ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button