KhammamPoliticalTelangana

కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా అరిగెల నరసింహారావు

కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా అరిగెల నరసింహారావు

కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా అరిగెల నరసింహారావు

సికె న్యూస్ ప్రతినిధి
జూలూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అరిగేల నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులుగా నూతనంగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ గారు, టిపిసిసి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, మండల ఎస్సీ సెల్ నాయకులు మిరియాల కిరణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కంపసాటి వెంకటేశ్వరరావు మరియు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నూతనంగా నియమితులైన అరిగెల నరసింహారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు,జిల్లా అధ్యక్షులు పోడేం వీరయ్య కి, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కి, మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button