HyderabadPoliticalTelangana

పింఛన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి?

పింఛన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి?

పింఛన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి?

Web desc : ఓ వితంతు పింఛన్ మంజూరు చేయించినందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్ లాల్ శనివారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

వితంతు పింఛన్ కోసం..​ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడు 2023లో మృతి చెందగా, తన కోడలికి ‘తెలంగాణ చేయూత’ పథకం కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి పింఛన్ మంజూరు చేయించినందుకు కార్యదర్శి చవాన్ లాల్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, శనివారం బాధితుడి ఇంటి వద్దే చవాన్ లాల్ లంచం తీసుకుంటుండగా పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు.
టోల్ ఫ్రీ నంబర్..

నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సప్ నంబర్ 9440446106కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button