— బిజెపి విజయసంకల్పయాత్రను విజయవంతం చేద్దాం: మట్టా ప్రసాద్.
సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
ఈనెల 25 నుంచి భద్రాచలం నుంచి ప్రారంభంమై సత్తుపల్లి నియోజకవర్గానికి 26వ తారీకు చేరుకొనున్న విజయ సంకల్పయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ వేంసూర్ మండల అధ్యక్షులు పర్సా రాంబాబు అధ్యక్షతన జరిగిన మండల సమావేశానికి
ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మట్టా ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుంచి బిజెపి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలకృష్ణారెడ్డి యువమొర్చా జిల్లా కార్యదర్శి పాలా నాగసురేందర్ రెడ్డి, కిన్నెర మహేష్, జొన్నలగడ్డ నవీన్, ఉబ్బల కృష్ణ, నాగేశ్వరరావు, రామాల పిచ్చయ్య, మాధవాచారీ తదితరులు పాల్గొన్నారు