పరివార్ బిర్యానీ హౌస్ లో పేలిన గ్యాస్ సిలిండర్లు గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు జరిగినట్లు అనుమానం స్వల్ప గాయాలతో బయటపడ్డ వర్కర్లు సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 24 ఆలేరు పెద్దవాగు దగ్గర పరివార్ బిర్యానీ హౌస్ లో గ్యాస్ సిలిండర్ల పేలుడు సంభవించింది.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బిర్యానీ హౌస్ లో గ్యాస్ ఓపెన్ చేసే సందర్భంలో రెండు గ్యాస్ సిలిండర్లు లీక్ అయి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా రెండు సిలిండర్లు పేలుడుకు …

పరివార్ బిర్యానీ హౌస్ లో పేలిన గ్యాస్ సిలిండర్లు

గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు జరిగినట్లు అనుమానం

స్వల్ప గాయాలతో బయటపడ్డ వర్కర్లు

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 24

ఆలేరు పెద్దవాగు దగ్గర పరివార్ బిర్యానీ హౌస్ లో గ్యాస్ సిలిండర్ల పేలుడు సంభవించింది.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బిర్యానీ హౌస్ లో గ్యాస్ ఓపెన్ చేసే సందర్భంలో రెండు గ్యాస్ సిలిండర్లు లీక్ అయి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా రెండు సిలిండర్లు పేలుడుకు గురయ్యాయని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 24 Feb 2024 1:27 PM IST
cknews1122

cknews1122

Next Story