జలగల పీల్చుకు తింటున్న రంగారెడ్డి జిల్లా కొందుర్గు తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది
పైసలు ఇస్తేనే పని లేకుంటే ముప్పు తిప్పలే
దేశ రక్షణ కోసం బోర్డర్ దగ్గర ప్రాణాలు పనంగా పెట్టి డ్యూటీ చేసే జవాన్ ను కూడా వదలని లంచగొండి జలగలు
నీ పని కావాలంటే నలభై వేలు లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్
కేవలం ఆర్ ఓ ఆర్ పహానీలకోసమే 30 వేలు లంచం తీసుకున్నా రికార్డ్ అసిస్టెంట్
రంగారెడ్డి జిల్లా కొందుర్గు తహశీల్దార్ కార్యాలయంలో ప్రయివేట్ వ్యక్తులతో కలిసి రికార్డ్ అసిస్టెన్స్ట్ బలరాజ్ చేతివాటం చూపించాడు
ఆఫీసులో రికార్డు షక్షన్ లో ఆ ప్రయివేట్ వ్యక్తిదే హవా కొనసాగుతుంది అని స్థానికులు వాపోతున్నారు
అధికారులకు సైతం ముడుతున్న ముడుపులు అందిస్తున్నాం అని రికార్డ్ అసిస్టెంట్ చెప్పిన వీడియో వైరల్ అవుతుంది
అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న జవాన్ ఒక సెల్ఫీ వీడియో ను విడుదల చేశాడు
జవాన్ కు సైతం లంచం ఇవ్వక తప్పలేదు
శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం,:మార్చ్ 8 ( సి కె న్యూస్ )
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథపూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే సైనికుడు తన పొలం కు సంబంధించిన ఆర్ ఓ ఆర్ పహానీలు కావాలని కొందుర్గు మండల తహీసిల్దారు ఆఫీస్ లో దరకాస్తు చేసుకోగా అతనికి చేదు అనుభవం ఎదురైంది,
నలభై వేలు ఇస్తే నే నీ ఆర్ ఓ ఆర్ పహానీలు ఇస్తాం అని రికార్డ్ అసిస్టెంస్ట్ బాలరాజు,సదరు జవాను అశోక్ నీ డిమాండ్ చేశారు.
అందుకు జవాన్ ఒప్పుకోకపోవటం తో అతని డాక్యుమెంట్ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు చేసేది ఏమి లేక జవాన్ వారికి 30వేల రూపాయలు ఇచ్చి ఆ తతంగాన్ని అంత వీడియో చిత్రీకరించారు
తిరిగి ఆయన తన డ్యూటీ కి వెళ్లిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో తో పాటు లంచం అడిగిన మరియు లంచం తీసుకున్న వీడియోస్ మీడియాకు అందించారు.