*కవిత అరెస్టు ఇష్యూపై*
లిక్కర్ స్కామ్ వ్యవహారం టీవీ సీరియల్ ఎపిసోడ్స్ లా సాగుతోంది..
ఎన్నికల నోటిఫికేషన్ కు 24 గంటల ముందు కవితను అరెస్టు చేశారు…
కవిత అరెస్టు ఎన్నికల స్టంట్..
సానుభూతితో బీఆరెస్.. అరెస్టు చర్యలతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి.
కవితను అరెస్టు చేసే సమయంలో కేసీఆర్ అక్కడకు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇప్పటి వరకు కేసీఆర్ అరెస్టును ఖండిచలేదు… ప్రజలకు వివరణ ఇవ్వలేదు..
కేసీఆర్ మౌనం దేనికి సంకేతం
నిన్న ఈడీ.. మోడీ కలిసే రాష్ట్రానికి వచ్చారు..
రాజకీయంగా కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే బీఆరెస్, బీజేపీ డ్రామాలు..
డ్రామాలు కట్టిపెట్టి మోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి..
విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో.. మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలి..
చెప్పుకోవడానికి ఏమీ లేకనే బీజేపీ అరెస్ట్ డ్రామాకు తెర తీసింది.
కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయడానికి బీఆరెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఇది..
వీరిద్దరి నాటకాన్ని తెలంగాణ సమాజం గమనించాలి.
అరెస్టు విషయంలో కేసీఆర్, మోదీ మౌనం వెనక వ్యూహం ఏమిటి?
మా ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం మోదీ స్థాయికి తగదు.
తెలంగాణను అవమానించిన మోదీకి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా అర్హత లేదు..
పదేళ్ల కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా?
కాళేశ్వరంపై మేం జ్యుడీషియల్ విచారణ చేయిస్తున్నాం..
విచారణ నివేదికల ఆధారంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం..
మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు… అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదలం..
ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే.. వాళ్లు నిద్ర లేచేలోగా పక్కన ఎవరూ ఉండరు..
మీరు పడగొట్టాలని అనుకుంటే.. నిలబెట్టేందుకు మా ప్రయత్నం మేం చేస్తాం..
పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం…
నలభై ఏళ్లు రాజకీయ అనుభం ఉన్న కేసీఆర్.. నల్లగొండ సభలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమర్ధించుకుంటారా?
కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు..
పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరెండం..