లైంగిక వేధింపుల కేసులో సీఐ అరెస్ట్
వరంగల్: లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో సీఐని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు.. సీఐ సంపత్ పై పోక్సో కేసు చేసి అదుపులోకి తీసుకున్నారు.
గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక మహిళతో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది.
సదరు మహిళ కూతురి పట్ల కూడా సీఐ అసభ్యంగా ప్రవర్తించడంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.
దీంతో కేయూ పోలీసులు.. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సీఐగా పనిచేస్తున్న సీఐ సంపత్ పై అత్యాచార యత్నం, ఫోక్స్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.