భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద 16 లక్షలు విలువగల గంజాయి పట్టివేత. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), మార్చ్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం,ఆంధ్ర ,ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయిని భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఒక మహీంద్రా బొలెరో వాహనంలో సుమారు 32 ప్యాకెట్ల గంజాయిని తరలిస్తున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు వాహనం …

భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద 16 లక్షలు విలువగల గంజాయి పట్టివేత.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 22,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం,ఆంధ్ర ,ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయిని భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

ఒక మహీంద్రా బొలెరో వాహనంలో సుమారు 32 ప్యాకెట్ల గంజాయిని తరలిస్తున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు వాహనం ఆపి తనికి చేయగా 66 కేజీల గంజాయి పట్టుబడింది.

పట్టు బడిన గంజాయి విలువ సుమారు 16 లక్షల ఉండొచ్చని అంచనా గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఎన్నికల్లో భాగంగా భద్రాచలంలోని సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు వైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నప్పటికీ గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు.

Updated On 22 March 2024 5:37 PM IST
cknews1122

cknews1122

Next Story