భద్రాచలం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం….
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్…
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 23,
భద్రాచలంలో డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ .
అనంతరం వారు మాట్లాడుతూ అనదు ఎంపీగా కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానని, ఈసారి మళ్లీ సోనియమ్మ టికెట్ ఇచ్చి పంపించిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలకు కోరారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు…