HyderabadPoliticalTelangana

ఇద్దరు బాలికల బలవన్మరణం

ఇద్దరు బాలికల బలవన్మరణం

ఇద్దరు బాలికల బలవన్మరణం

ప్రవర్తన మార్చుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు బలన్మరణానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే…బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయగిరి గ్రామం నెల్లూరు జిల్లా చెందిన వెంకటేశ్‌ రమణమ్మకు ఇద్దరు కూతుళ్లు వినీల (17) ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. అఖిల (15) ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది.

గతంలో వెంకటేశ్‌ బెంగళూరులో పనిచేసేవాడు. మూడు నెలల కిందట నగరానికి వచ్చారు. బాలాపూర్ మండలంలో ఉన్న ఆర్‌సీఐ రక్షణశాఖలో కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది. దీంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని బాలాపూర్ మండల పరిధిలోని మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు.

అమ్మాయిలు ఇద్దరు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు గత కొన్ని రోజుల నుంచి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

పెద్ద అమ్మాయి వినీల గత మూడు నెలల కిందట యువకుడుని ప్రేమించి ఇంట్లో నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మైనర్ కావడంతో ఒప్పించి తీసుకొచ్చారు. కులాంతర వివాహం వద్దు అని తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

అప్పటినుంచి అక్క చెల్లి ఇద్దరు కూడా తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోవాలని కూతుళ్లకు చెప్పారు. కష్టపడి చదువుకోవాలని సూచించారు. బతుకుదెరువు కోసం ఊరు విడిచి ఇంత దూరం వచ్చామని.. కనుక పద్ధతిగా ఉండాలని సూచించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు.

దాంతో ఇద్దరు మనస్తాపం చెంది తండ్రి ఆర్‌సీఐకి పనికి పోవడం, తల్లి కిరాణా షాప్‌కు పోయిన విషయం గమనించిన ఇద్దరు అక్క చెల్లెలు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం వెంటిలేటర్‌కు రెండు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. తల్లి ఇంటికొచ్చేసరికి తలుపు వేసుకొని ఉన్నారు.

ఎంత తలుపు కొట్టినప్పటికీ తీయకపోవడంతో ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. అయినా, కూడా తలుపులు తీయకపోవడంతో స్థానికులు బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కాచెల్లెళ్ల ఇద్దరి మృతదేహాలను కిందికి దించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల కోసం ఊరు విడిచిపెట్టి బతుకుదెరువు కోసం వచ్చామని పిలపించారు.

పిల్లలిద్దరూ బాగా చదువుకొని గొప్ప వాళ్లవుతారని కలలు కంటే మాకు కన్నీళ్లు మిగిల్చారని తల్లిదండ్రులు రోదించారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో చేర్పించాలన్న లక్ష్యంతో పనిచేసుకుంటున్నామన్నారు. ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఇంకా ఎవరి కోసం బతకాలంటూ బోరున విలపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button