PoliticalTelangana

బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో అపశృతి

కొత్తగూడెం జిల్లా లో బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో అపశృతి

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది.

ఇవ్వాళ ఉదయం మల్లాయిగూడెంలో ప్రచార రథంపై ఉన్న రమేష్ (50) అనే బీఆర్ఎస్ నాయకుడికి గుండెపోటు రావడంతో ఒకసారి గా కుప్ప కూలిపోయాడు.

వెంటనే అక్కడ ఉన్న నేతలు వేంటనే స్పందించి రమేష్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ నేత మృతితో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.

బీఆర్ఎస్ నాయకుడు మృతి పట్ల ఎమ్మెల్యే మెచ్చా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button