రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన లారీ ఓనర్ కం డ్రైవర్ ఆర్థిక సహాయం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఏప్రిల్ 05,
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన లారీ ఓనర్ కం డ్రైవర్ పిచ్చయ్యకు 83 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్న మణుగూరు ఏరియా లారీ యజమానులు మరియు డ్రైవర్లు హెల్పర్లు..
ఇటీవల రామానుజవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి
శాశ్వత అంగవైకల్యం ఏర్పడి దిక్కుతోచని స్థితిలో ఉన్న స్థానిక అశోక్ నగర్ కు చెందిన లారీ ఓనర్ కం డ్రైవర్ పిచ్చయ్యకు స్థానిక లారీ యజమానులు మరియు డ్రైవర్లు, హెల్పర్లు సంయుక్త ఆధ్వర్యంలో పిచ్చయ్య ఇంటి వద్ద పరామర్శించడంతో పాటు 83 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు,
ఈ సందర్భంగా లారీ యజమానులు మాట్లాడుతూ మోటార్ ఫీల్డ్ అంటేనే రక్తపు కూడు అని,నల్లని రోడ్లపై ఎర్రని రక్తపు ధారల జీవితమని తెలిసి కూడా మోటార్ ఫీల్డ్ లో పనిచేయటం అనేది ఒక మక్కువ అని ధైర్యం ఉన్నవాడే లారీ యజమానులు డ్రైవర్లు, హెల్పర్లుగా కొనసాగుతారని మోటారు రంగంపై అనుభవం ఉన్న పెద్దలు చెబుతారని అదే సమయంలో రోడ్డు ప్రమాదాల పట్ల కూడా ప్రతి లారీ ఓనర్ కమ్ డ్రైవర్, హెల్పర్లు అప్రమత్తంగా ఉండాలని తమ జీవితంతో పాటు తన కుటుంబం, రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనాలు, పాద చారుల పట్ల కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. పిచ్చయ్య త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లారీ యజమానులు కమ్ డ్రైవర్లకు, హెల్పర్లకు 50 లక్షల జీవిత భీమా పథకాలు వర్తింప చేయాలని, ప్రమాదాలలో అంగవైకల్యం ఏర్పడిన యజమానులు మరియు డ్రైవర్ క్లీనర్లకు కుటుంబ పోషణ నిమిత్తం పెన్షన్ పథకం అమలు చేయాలని లారీ యజమానులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో లారీ యజమానులు జున్నూరు వెంకన్న బాబు, స్వామి, , మిడిదొడ్ల నాగేశ్వరరావు, తూపూడి శ్రీనివాస్ రావు, కనకయ్య, లాలు, చింటూ, బాలకృష్ణ, నాగయ్య, వెంకన్న, దామల్ల లక్ష్మణ్, రవి , మురళి, వలి,సింహాలం,బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.