డెక్కన్ సిమెంట్స్ వద్ద ఉద్రిక్తం
డెక్కన్ సిమెంట్ యాజమాన్యం గిరిజనుల మధ్య వివాదం
కోర్టు ఉత్తర్వులను పట్టించుకోని యాజమాన్యం
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మే 05
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం దక్కన్ సిమెంట్స్ వద్ద ఉద్రిక్తం నెలకొంది వివరాలకు వెళితే డెక్కన్ సిమెంట్ యాజమాన్యం స్థానిక గిరిజనుల మధ్య ఉన్న లారీయార్డు విషయంలో భూమి వివాదంతో ఆదివారం గిరిజనులు గొడవకు దిగారు.
కోర్టు ఉత్తర్వులతో భూమి మీదకు వచ్చిన గిరిజనులను దక్కన్ సిమెంట్స్ యాజమాన్యం అడ్డుకోవడంతో
ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది స్థానిక గిరిజనులు మాట్లాడుతూ అక్రమంగా మా భూముల్లో లారీయార్డు ఏర్పాటు చేశారని ఖాళీ చేయాలని గిరిజనులు లారీలకు అడ్డంగా కూర్చొని ధర్నా ఆందోళన చేశారు.
మాకు హుజూర్నగర్ కోర్టు, హైకోర్టు నుండి పోలీసులు,డెక్కన్ సిమెంట్ యాజమాన్యం గిరిజన భూమిలో జోక్యం చేసుకోకుండా ఉండాలని ఉత్తర్వులు అన్న అవేమీ పట్టించుకోకుండా అక్రమంగా రాళ్ళు పోయడంతో దిక్కు లేని స్థితిలో గిరిజనులు వారిని అడ్డుకున్నారనీ ఏదిఏమైనా అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని అట్టి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు.