Andhra PradeshPolitical

హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు..

హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు..

హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు.దీంతో నంద్యాల టూ టౌన్ పిఎస్ లో Cr. No.71/2024.U/s 188IPC సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు నంద్యాలలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ నంద్యాల వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నివాసానికి రావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బన్నీని చూడటానికి ప్రజలు వేలాదిగా రావడంతో స్థానికులు ఇబ్బంది పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎలక్షన్ కోడ్ 31 ఏపీ యాక్ట్ , సెక్షన్ 144 అమలులో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాదిమందిగా కలవడం నేరమని ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పిఎస్ లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button