అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి దుర్మరణం.! పై చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లికు చెందిన గుంటిపల్లి సౌమ్య(25) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.అక్కడి అట్లాంటిక్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తుంది. ఆదివారం రాత్రి న్యూయర్క్ లో సౌమ్య రోడ్డు ప్రమాదానికి గురైంది.అమెరికాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య మృతి చెందింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సౌమ్యను అతివేగంతో …

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి దుర్మరణం.!

పై చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లికు చెందిన గుంటిపల్లి సౌమ్య(25) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.అక్కడి అట్లాంటిక్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తుంది.

ఆదివారం రాత్రి న్యూయర్క్ లో సౌమ్య రోడ్డు ప్రమాదానికి గురైంది.అమెరికాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య మృతి చెందింది.

రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సౌమ్యను అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సౌమ్య చదువుతో పాటు పార్ట్‌టైమ్ జాబ్‌ చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

ఉన్నత చదువులు చదివి పై స్థాయికి వెళ్తుందని ఆశించిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సౌమ్య మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషయంలో నెలకొంది.

Updated On 27 May 2024 11:42 PM IST
cknews1122

cknews1122

Next Story