వేడుకగా గురు పౌర్ణమి పలమనేరు నియోజకవర్గం, జూలై 21, సీకే న్యూస్. భగవద్గీత అర్జునుని నిమిత్తం గా చేసుకుని,, శ్రీకృష్ణుడు లోకానికి ఉద్బోధించి 5070 సంవత్సరాలు కావస్తోంది. గురు పౌర్ణమి సందర్భంగా అద్వితీయ గీతా మాలిక ను అందించిన శ్రీకృష్ణుడు లోకానికి గురువు. గురు పౌర్ణమి సందర్భంగా…. వివరాలు ఇలా ఉన్నాయి .పలమనేరులోని, బసవన్న గుడిలో, పల్లవి ,తేజస్వి అనే ఇద్దరు ఔత్సాహిక అధ్యాపకులు పిల్లలకు ఉచితంగా భగవద్గీత ప్రతి ఆదివారం ఉదయం పది నుండి ఒక …

వేడుకగా గురు పౌర్ణమి

పలమనేరు నియోజకవర్గం, జూలై 21, సీకే న్యూస్.

భగవద్గీత అర్జునుని నిమిత్తం గా చేసుకుని,, శ్రీకృష్ణుడు లోకానికి ఉద్బోధించి 5070 సంవత్సరాలు కావస్తోంది. గురు పౌర్ణమి సందర్భంగా అద్వితీయ గీతా మాలిక ను అందించిన శ్రీకృష్ణుడు లోకానికి గురువు. గురు పౌర్ణమి సందర్భంగా….

వివరాలు ఇలా ఉన్నాయి

.పలమనేరులోని, బసవన్న గుడిలో, పల్లవి ,తేజస్వి అనే ఇద్దరు ఔత్సాహిక అధ్యాపకులు పిల్లలకు ఉచితంగా భగవద్గీత ప్రతి ఆదివారం ఉదయం పది నుండి ఒక గంట వరకు నేర్పిస్తున్నారు.

ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా, బసవన్న గుడిలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సమక్షంలో తేజస్వి, పల్లవి టీచర్ల ఆధ్వర్యంలో భగవద్గీత ప్రాశస్త్యాన్ని మరియు అర్జునునికి శ్రీకృష్ణుడు బావ అయినప్పటికీ…. గురుముఖంగా శ్రీకృష్ణుని అర్జునుడు ఏ విధంగా భావించి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుని ద్వారా భగవద్గీత బోధను ఏ విధంగా స్వీకరించాడు అనే విషయాన్ని టీచర్లు ఇద్దరు కూలంకషంగా వివరించారు.

భగవద్గీత చదివితే వాక్కు పరిశుద్ధమవుతుంది. ఏది చేయకూడదు, ఏది చేయవచ్చు, మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు బోధపడతాయి. భగవంతుడు ఎవరి వద్ద ఏమి ఆశించడు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని, ఈ సందర్భంగా పిల్లలకి అర్థం అయ్యేవిధంగా వివరించి చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శంభు శివ ప్రకాష్, పల్లవి, తేజస్వి, ద్రాక్షాయిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Updated On 21 July 2024 6:46 PM IST
cknews1122

cknews1122

Next Story