PoliticalsuryapetaTelangana

ప్రిన్సిపల్‌ రూంలో బీరు బాటిళ్ల ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్

ప్రిన్సిపల్‌ రూంలో బీరు బాటిళ్ల ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్

ప్రిన్సిపల్‌ రూంలో బీరు బాటిళ్ల ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్

సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు..

శనివారం ప్రిన్సిపాల్‌ రూమ్‌లో 4 బీరు బాటిళ్లు కనిపించడంతో ఆమె రూమ్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్‌ శైలజ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని, ప్రశ్నిస్తే చేయి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని 4న సూర్యాపేట-జనగాం రహదారిపై విద్యార్థినులు బైఠాయించగా.. సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ అరుణకుమారి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

తాజాగా ప్రిన్సిపల్‌ శైలజ తన చాంబర్‌లోనే కేర్‌ టేకర్‌ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వరకు మందు తాగుతారని, సమస్యలపై ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిరసన వ్యక్తంచేశారు.

విషయం తెలుసుకున్న ఆర్డీవో వేణుమాధవరావు, ఆర్సీవో అరుణకుమారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్‌, సీఐ రాజశేఖర్‌, రూరల్‌ ఎస్సై బాలునాయక్‌ కళాశాలకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. శైలజను సస్పెండ్‌ చేయడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.

ఘటనపై మంత్రి ఉత్తమ్‌ సీరియస్‌

ప్రిన్సిపల్‌ గదిలో బీరు సీసాలు కనిపించిన ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. విచారణ జరిపించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ను శనివారం ఫోన్‌లో ఆదేశించారు.

దీంతో కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్‌ లత, సభ్యులుగా జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్డీవో వేణుమాధవ్‌, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి లతతో విచారణ కమిటీని కలెక్టర్‌ ఏర్పాటు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button