కొత్త ఇంటి కల నెరవేరక ముందే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి కొత్త ఇంటి కల నెరవేరక ముందే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని హుజూర్నగర్ బైపాస్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన, చింతా రాజు (23)సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. పట్టణంలోని ఉత్తం పద్మావతి కాలనీలో తన సొంత ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటికి వాటర్ …

కొత్త ఇంటి కల నెరవేరక ముందే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

కొత్త ఇంటి కల నెరవేరక ముందే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని హుజూర్నగర్ బైపాస్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన, చింతా రాజు (23)సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. పట్టణంలోని ఉత్తం పద్మావతి కాలనీలో తన సొంత ఇల్లు నిర్మించుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఇంటికి వాటర్ కొట్టేందుకు వెళ్లి తన ద్విచక్ర వాహనంపై తిరిగి గాంధీనగర్ కు వస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.

Updated On 23 July 2024 10:41 PM IST
cknews1122

cknews1122

Next Story