Telangana

37 కార్పొరేషన్లకు చైర్మన్ ల నియామకం

37 కార్పొరేషన్లకు చైర్మన్ ల నియామకం

37 కార్పొరేషన్లకు చైర్మన్ ల నియామకం

రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నయమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్‌ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్‌రెడ్డి ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారిని ఛైర్మన్లుగా ఎంపిక చేశారు. మే 13న రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో ఛైర్మన్లుగా ఎంపిక అయిన వారు చురుకుగా పని చేస్తారని పార్టీ ఆలోచనగా ఉంది. ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇందులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సతీమణి నిర్మల జగ్గారెడ్డి ఉన్నారు. ఆమెకు బీసీ గౌడ్ కోటాలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్ పదవి ఇచ్చారు.

పటేల్ రమేష్ రెడ్డి (OC, రెడ్డి) తెలంగాణ టూరిజం, కె. శివ సేన రెడ్డి (OC, రెడ్డి) స్పోర్ట్స్ ఆథారిటీ, ఎన్ ప్రీతమ్ (ఎస్సీ, మాదిగ) ఎస్సీ కార్పొరేషన్, నూతి శ్రీకాంత్ (బీసీ, గౌడ్) బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్. అన్వేష్ రెడ్డి తెలంగాణ సీడ్స్, అనిల్ ఎరావత్ తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, విజయ్ బాబు హౌసింగ్ కార్పొరేషన్, నాగేశ్వర రావు తెలంగాణ వార్హౌసింగ్, బాలా రాజు టీజీ ఆగ్రో, నేరేళ్ల శారద మహిళ కమిషన్, శోభ రాణి టీజీ ఉమెన్స్ అండ్ కో ఆపరేటివ్ ఛైర్మన్ గా ఎంపిక చేశారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button