PoliticalTelangana

ఇదేనా మాకు ఇచ్చే గౌరవం….?

ఇదేనా మాకు ఇచ్చే గౌరవం….?

ఇదేనా మాకు ఇచ్చే గౌరవం….? టిడిపి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పై గరం గరం..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

ఫిబ్రవరి 18,

భద్రాచలంలో జరుగుతున్నటువంటి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి, భద్రాచలం డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను అనుమతించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎస్కే అజీమ్, కంభంపాటి సురేష్, రాజారాం, రేపాక రాంబాబు.గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పాలకమండలి సమావేశాల్లో తమకు వినతి పత్రాలకు సమర్పించే అవకాశం కల్పించారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న తొలి పాలక మండలి సమావేశంలో తమను గేటు వద్ద నిలిపివేయడంపై ఇదేనా మిత్రపక్షం కు ఇచ్చే మర్యాదా…! అంటూ మండి పడ్డారు.

నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని, అలాంటి మిత్రపక్షమైన తమను గేటు వద్ద నిలిపి అవమానించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎజెండా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు…..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button