HealthHyderabadPoliticalTelangana

వైధ్యం వికటించి 7 నెలల బాలుడు మృతి

వైధ్యం వికటించి 7 నెలల బాలుడు మృతి

వైధ్యం వికటించి 7 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. దీనికి సబందించిన వివరాలు, పోలీసులు , గ్రామస్థుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

మండల పరిదిలోని రాయపోల్ గ్రామానికి చెందిన ఖానాపురం ప్రవలిక మహేష్ దంపతుల కుమారుడు ప్రజ్వల్‌కు తీవ్ర జ్వరం రావడంతో శనివారం సాయంత్రం ఆస్పత్రికి తీసుకవచ్చారు.

డాక్టర్లు డెంగ్యూ పీవర్ వచ్చిందని ట్రీట్ మెంటు ప్రారంభించగా ఆదివారం ఉదయం టెస్టులు చేయగా ప్లేట్ లేవల్ భారిగా పడిపోవడంతో నగరoలోని హాస్పత్రికి తరళించే మార్గంలో తల్లి దండ్రులను కోరారు.

దీంతో తల్లిదండ్రులు నగరానికి తరళించే సమయంలోనే మార్గమద్యలోనే బాలుడు ప్రాణాలు వదిలారు. దీంతో కోపోద్రుక్తులైనా తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు రవిక్రిష్ణ హాస్పత్రి ముందు ఆందోళన దిగారు.

వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను సమూదాయించి డాక్టర్లతో చర్చలు జరిపి కుటుంబ సబ్యులు న్యాయం చేయాలని కోరారు..

ఈకార్యాక్రమంలో రాయపోల్ గ్రామానికి చెందిన వివిద పార్టీల నాయకులు మూర్తి జంగారెడ్డి, మంఖాల కరుణాకర్ , శ్రీశైలం, సిఐ సత్యనారయణ, ఎస్‌ఐ చెందర్‌సింగ్ తదితరులు పాల్గోన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button