మున్సిపల్ సిబ్బంది తో కలిసి రాఖీ వేడుకలను జరుపుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ సీకే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్: మున్సిపల్ సిబ్బందికి రాఖీలు కట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు రాఖీ పండుగ సందర్భంగా సోమవారం కొల్లాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ చైర్ పర్సన్ రమ్య నాగరాజు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రమ్య నాగరాజు మాట్లాడుతూ సోదర సోదరీమణుల …

మున్సిపల్ సిబ్బంది తో కలిసి రాఖీ వేడుకలను జరుపుకున్న మున్సిపల్ చైర్ పర్సన్

సీకే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:

మున్సిపల్ సిబ్బందికి రాఖీలు కట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు

రాఖీ పండుగ సందర్భంగా సోమవారం కొల్లాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ చైర్ పర్సన్ రమ్య నాగరాజు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రమ్య నాగరాజు మాట్లాడుతూ సోదర సోదరీమణుల ఆప్యాయత మరియు అనురాగాలకు ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ వేడుక మున్సిపల్ సిబ్బందితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు రాఖీ పండుగ శుభ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సిబ్బందితో కలిసి జరుపుకోవడం పట్ల మున్సిపల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంట మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ విభాగం మరియు టౌన్ ప్లానింగ్ విభాగం మరియు శానిటేషన్ విభాగం మొదలగు అన్ని విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Updated On 20 Aug 2024 7:56 AM IST
cknews1122

cknews1122

Next Story