తగ్గని హైడ్రా దూకుడు.. ఈసారి స్కూల్‌నే టార్గెట్ చేసిందిగా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల హామీపై దృష్టి పెడుతూ మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో మరికొన్ని పథకాలు ప్రారంభించారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు.
హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు సమూలంగా నేలమట్టం చేసి భవిష్యత్ లో వరదలు రాకుండా కాపాడేందుకు ‘హైడ్రా’ను రంగంలోకి దింపినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అక్రమ కట్టాలపై ఫోకస్ పెట్టింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో హైడ్రా హడలెత్తిస్తుంది. హైడ్రా ఆధ్వర్యంలో నగరంలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అక్రమంగా కట్టడాలు నిర్మించినట్లు ఫిర్యాదులు అందితే చాలు విచారణ చేసి అక్రమ కట్టడాలు అని తేలితే కూల్చివేస్తున్నారు.
ఇప్పటికే మాదాపూర్ లోని ఎన్ కన్వేన్షన్ సెంటర్, రాంనగర్ లోని మణెమ్మ కాలనీలో నాళాలపై నిర్మించి కట్టడాలు కూల్చి వేశారు. మణికొండలో పలు విల్లాలకు నోటీసులు ఇచ్చారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే..
గత కొన్ని రోజుల నుంచి హైడ్రా దూకుడు పెంచింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండంలోని హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండా, అమీన్‌పూర్ లో ఆక్రమణలను కూల్చివేసింది.
ఐలాపూర తండాలో ఆక్రమించిన సుమారు 20ఎకరాల భూమిని రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల సర్వే నెంబర్ 119 లో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాట్లు వేశారని స్థానికులు ఆరోపించడంతో రంగంలోకి దూకిన హైడ్రా కట్టడాలు, సరిహద్దు రాళ్లను తొలగించారు.
అనంతరం ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆక్రమణలు కూల్చివేశారు. ఇక్కడ 15 గుంటల భూమి అక్రమంగా గదులు, ప్రహారీ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా గుర్తించడంతో కూల్చివేసినట్లు వార్తలు వస్తున్నాయి.