HyderabadPoliticalTelangana

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి...

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి...

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

జగిత్యాల జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది, ఆర్టీసీ బస్సు ఢీకొని ఈరోజు ఉదయం హోంగార్డు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి శివారులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మెట్ పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ సుబ్బరాజు అనే హోంగార్డు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున మెట్ పల్లిలోని ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లి టిఫిన్ తీసుకొని ఇంటికి వెళుతుండగా…

నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న TS16 UC9963 నంబర్ గల ఆర్టీసీ బస్ స్థానిక హోండా షోరూం వద్ద ఢీకొట్టడంతో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న మెట్ పల్లి ఎస్సై చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని హోంగార్డు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button