BhadrachalamKhammamPoliticalTelangana

మంత్రి తుమ్మల కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

మంత్రి తుమ్మల కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

మంత్రి తుమ్మల కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

  • మంత్రి తుమ్మల‌ను సన్మానించిన దమ్మపేట రైతు నాయకులు

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో, దమ్మపేట మండలానికి చెందిన రైతు నాయకులు గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గండుగులపల్లి గ్రామంలోని మంత్రి నివాసానికి వచ్చిన రైతులు ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రైతు నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కావడం ఎంతో ఆనందకరమని ఆయన అనుభవం, విజ్ఞానంతో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతోందినీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతులను అర్థం చేసుకునే నేతగా ఆయన నిలుస్తున్నారు అని పేర్కొన్నారు.రైతులకు మద్దతుగా, వారి భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తున్న మంత్రి తుమ్మల‌పై రైతులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమనీ,ప్రతీ రైతు ఇంటిలో ఆనందం నింపుతున్నామని, ప్రభుత్వం అందించే ప్రతి పథకం ఫలితంగా రైతులకు ఉపయోగం కలగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button