BhadrachalamPoliticalTelangana

రూ. కోటీ విలువ చేసే గంజాయి పట్టివేత…

భారీగా 319 కేజీల గంజాయి పట్టివేత..

రూ. కోటీ విలువ చేసే గంజాయి స్వాధీనం.

కీలక నిందితులు మునవర్‌ అలీ, దాత్తు పంచాల అరెస్టు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

సెప్టెంబర్ 24,

ఆంధ్రా, ఒరిస్సా బార్డర్‌ నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు తరలిస్తున్న 319 కేజీల గంజాయిని భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టుకునారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. కోటీ విలువ చేసే గంజాయి వాహనాలను, పది మంది నిందితులను, రెండు కార్లను, మూడు బైకులను, తొమ్మిది సెల్‌ ఫోన్లను, పది మంది నిందితులను పట్టుకున్నామని తెలిపారు.

కుటుంబంపై గంజాయి నేరాల మరకలు. నిన్న మొన్నటి వరకు తండ్రి సదాయ్య గంజాయి అక్రమ రవాణ కు పాల్పడుతూ జైలుపాలైతే.. నేడు భార్య అపర్ణ కుమారుడు నేరళ్ల అఖిల్‌ గంజాయి అక్రమ రవాణ చేస్తు ఎక్సైజ్ పోలీసులకు పట్టు బడ్డారు..

వీరికి మూడు రాష్ట్రాల్లో ఎన్ని కేసులు పెట్టినా.. గంజాయి అక్రమ రవాణ మార్గంలో ప్రయాణం చేస్తు నేరాలకు పాల్పడుతూ దర్జాగా తిరుగుతున్న మునవర్‌ అలీని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మునవర్‌ అలీ పట్టుబ డిన నిందితుల తో సంబంధం కలిగి ఉండడం కొస మెరుపు. భర్త గంజాయి అలవాటు పడితే.. భార్య మందలించాలి. కొడుకు గంజాయికి అలవాటు పడితే తండ్రి మందాలించాలి. కాని భర్త, భార్య, వారి కొడుకు కుటుంబం అంతా కలిసి గంజాయి వ్యాపారాన్ని కుటుంబ వ్యాపారంగా మార్చుకున్న తీరు అందరిని విస్మయానికి గురి చేసింది.

కొత్తగూడెం జి ల్లా భద్రాచలంలో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకొని పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో ప్రధానంగా ఒక కుటుంబం పూర్తిగా గంజాయి విక్రయాల వ్యాపారంగా చేసుకొని జీవిస్తూ గతంలో కూడ పలు నేరాలలో ఉండడం గమర్హనం.

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరుళ్ల అపర్ణ , కుమారుడు నేరేళ్ల అఖిల్‌ అంధ్రా ఒరిస్సా సరిహద్దు నుంచి కారులో 100 కిలలో గంజాయిని తరలిస్తూ తల్లికొడుకులు పట్టుబడడం ఒకంత విస్మయానికి గురి చేస్తుంది. నేరేళ్ల అపర్ణ భర్త నేరేళ్ల సదాయ్య కూడ గంజాయి వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.

ఈ క్రమంలో ఆతడి వ్యాపారాన్ని ముందుకు తీసుక వెళ్లడానికి అతని భార్య, కుమారుడితో కలిసి గంజాయి దందాను కొనసాగిస్తుంది. వీరి వద్ద నుంచి నేరేళ్ల అపర్ణ భర్త సదయ్య కు మిత్రుడైన నిమాజాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్‌ మునవర్‌ అలీ అనే అతడు కూడ చేతులు కలిపాడు.

మునవర్‌ అలీ నేరేళ్ల అపరర్ణ భర్త గతం ఇద్దరు కలిసి గంజాయి వ్యాపారం చేయగా ఇద్దారు 2017లో విజయవాడ లోని భవాణి పురం పోలీస్‌ స్టేషన్‌లో గంజాయిలో కేసులో అరెస్టు కాబ డి జైలుకు వెళ్లారు. ఐనా తమ తీరు మార్చుకొని నేరేళ్ల సదయ్య కుటుంబ మరియు మునవర్‌ అలీ ఇదే దందా ను కొనసాగిస్తూ మహా రాష్ట్ర, నిజామాబాద్‌ మొదలైన ప్రాంతాల్లో అమ్మకాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో నేరేళ్ల అపర్ణ అమె కొడుకు నేరేళ్ల అఖిల్‌ ఇద్దరు నిజామాబాద్‌కు చెందిన మునవర్‌ అలీ కోసం గంజాయి తరలిస్తు ఉండగా భద్రాచలంలో నమ్మదాగిన సమాచారంతో దాడి చేసి వీరి దందాకు తెరదింపారు. ఏఓబీ ఆంధ్రా ఒరిస్సా బార్డర్‌ నుంచి గంజాయిని అక్రమ రవాణ చేసి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సప్లయి చేస్తు కోట్లు గడిరచాడు.

చివరకు హైదరాబాద్‌కు ఏపీ నుంచి గంజాయిని రవాణ చేయిస్తూ.. భద్రాచలం ఎక్సైజ్‌ పోలీసులకు కీలక నిందితుడితులు మునవర్‌ అలీ, దాత్తు పంచాల్‌ పట్టుబ డి కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..ఏపీలోని పసుపులంక, చింతూరు, మోతుగూడెం ప్రాంతాల నుంచి మునవర్‌ అలీ అనే వ్యక్తి మరి కొంత మందితో 319 కిలోల గంజాయిని తరలిస్తున్న క్రమంలో గంజాయిని తీసుకవస్తున్న వారంత పట్టుబడ్డారు.

వారిని విచారించగా నిజామాబాద్‌కు చెందిన మునవర్‌ అలీ మరి కొంతమంది స్మగ్లర్లు గంజాయిని తీసుకవస్తున్నపుడు ఎక్సైజ్‌ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు.

భారీగా కేసులు..

మునార్‌ అలీపై భద్రాచలంలో నమోదు కాబ డిన కేసులతోపాటు గతంలో అనేకంగా కేసులు ఉన్నాయి.
2017లో ఎన్‌డీపీఎస్‌ కిందా వచ్చె గంజాయిని సరపరా చేస్తూ నిజామాబాద్‌ టౌన్‌ 4లో ఒక కేసు,
2018లో నిజామాబాద్‌ రూరల్‌లో ఒక కేసు,
2007లో మహారాష్ట్రంలోని పాట్నాలో ఒక కేసు,
2013లో నిజమాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ల ఒక కేసు,
2017లో బాచన్నపేట్‌, వరంగల్‌ జి ల్లాలో ఒక కేసు,
2017లో పత్తిపాడు ఈస్ట్‌ గోదావరి జి ల్లాలో ఒక కేసు, 2017లో ఏపీలోని భావానిపురం లో ఒక కేసు,
2017లో విజయవాడలోని ఉంగూటూరులో ఒక కేసు నమోదు అయ్యాయి. 2024 సెప్టెంబ రు 23న ప్రస్తుతంలో భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణ
కేసులో నిందితుడిగా మారిన మునవర్‌ అలీని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రహిమ్‌ ఉన్నీసా బేగం సిబ్బంది కలిసి ఐదు కేసుల్లో భారీ మొత్తంలో 319 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

పట్టుకున్న గంజాయి వివరాలు అంధ్రా ఒరిస్సా బార్డర్‌ (ఏఓబీ) నుంచి హైదారాబాద్‌కు తరలిస్తున్న 319 కేజీల గంజాయిని భద్రాచలం ఎక్సైజ్‌ శాఖ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న రెండు కార్లు, ఒక స్కూటీని, మూడు బైక్‌లను 9 సెల్‌ ఫోన్ల ను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్న గంజాయి విలువ రూ. 79.75 లక్షలు, రెండుకార్లు, స్కూటీ, బైక్‌ విలువ రూ. 21 లక్షలు మొత్తంగా రూ. కోటీ ఉంటుందని అంచనా వేశారు. గంజాయితో పాటు రెండు కార్లు, ఒక స్కూటీతో రెండు బైక్‌లు పాటు 9సెల్‌పోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో పది మంది అరెస్టుని అరెస్టు చేయగా నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఏపీ పసుపులంక నుంచి హైదారాబాద్‌ కు స్కూటీ పై తరలిస్తున్న 14 కేజీల గంజాయిని, చిత్తూరు నుంచి హైదారాబాద్‌ కు కారులో తరలిస్తున్న 100 కేజీలు, ఏపీ లోని మోతుగూడెం నుంచి హైదారాబాద్‌ కు కారులో తరలిస్తున్న 180 కేజీల గంజాయిని భద్రాచలం చెక్‌పోస్టు వద్దా పట్టుకున్నారు. మరో రెండు కేసుల్లో 25 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

14 కేజీల గంజాయిని హైదారాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో పతేనగర్‌ బాలనగర్‌కు చెందిన శక్తి రాహుల్‌, గోపిశెట్టి అక్షిత్‌లను అరెస్టు చేశారు. 100 కేజీల గంజాయిని పట్టుకున్న కేసులో పెద్దాపల్లి జి ల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తల్లికుమారులు నేరెళ్ల అపర్ణ, నేరేళ్ల అఖిల్‌లను అరెస్టు చేశారు.

180 కేజీల గంజాయి కేసులో బేగం బ జార్‌కు చెందిన దత్తు పంచాల్‌ను అరెస్టు చేశామని ఖమ్మం ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి , అసిస్టేంట్‌ కమిషనర్‌ జి .గణేష్‌ ఈఎస్‌ జానయ్యలు తెలిపారు.

20 కేజీల గంజాయిని హైదారాబాద్‌కు తరలించడానికి తరలిస్తున్న సమయంలో ఎస్టీఎప్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఒరిస్సా మల్కాన్‌ గిరి ప్రాంతానికి చెందిన గణేష్‌, శేఖర్‌ చౌదారిలను అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన బనిగెల మహేస్‌, బాపట్లకు చెందిన చేగుడి దినేష్‌ ఐదు కిలోల గంజాయిని తీసుక వస్తు ఉండగా ఎస్టీఎప్‌ పోలీసులు పట్టుకున్నారు.

గంజాయిని పట్టుకున్న భద్రాచలం సీఐలు రహిమ్‌ ఉన్నీసా బేగం, ఎస్‌ రమేష్‌, ఎస్సైలు కే.గౌతం, అల్లూరి సీతామారామరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ సయ్యద్‌ అలీం, కానిస్టేబుళ్లు కె. బాబు, వీరబాబు, రాకేష్‌, కిరణ్‌ కుమార్‌, నాగేశ్వర్‌రావులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!