
జయభేరి పార్క్‌లో హెడ్ కానిస్టేబుల్ మృ*తి…
Web desc : మేడ్చల్ జిల్లా, కోంపల్లి, జయభేరి పార్క్‌లోని సాయి నిలయం ఫ్లాట్ నంబర్ 101లో నివాసం ఉంటున్న సొంటానా కృష్ణారావు, హెడ్ కానిస్టేబుల్-5996, బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తేదీ 24.10.2026న మధ్యాహ్నం సుమారు 12:00 గంటల సమయంలో విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతూ స్నానం చేసిన అనంతరం తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు.
కొద్దిసేపటి తర్వాత ఆయన భార్య భోజనం చేయడానికి పిలిచినప్పటికీ స్పందించకపోవడంతో, తలుపు తట్టి పిలిచినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగా, తన భర్త మంచంపై కదలికలు లేకుండా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ బిక్షాలు సహాయంతో డాక్టర్ చరణ్‌ను సంప్రదించగా, ఆయన పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
అనంతరం 108 అంబులెన్స్‌లో సమీపంలోని విజయత హాస్పిటల్‌కు తరలించగా, అక్కడి వైద్యులు కూడా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడు గతంలో ఛాతినొప్పితో బాధపడుతూ వెల్‌నెస్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు భార్య తెలిపారు. ఈ ఘటనపై పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టడం జరిగింది.




