మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..
భారీగా ఆస్తి నష్టం…
మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తా లోని ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాప్ ముందు బాబ్రీ బైక్ చార్జింగ్ పెట్టడంతో వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.దీంతో షాపు అద్దాలు పగిలి పోయి లోపలికి మంటలు వ్యాపించాయి.
పార్క్ చేసిన బైక్ మంటల్లో పూర్తిగా దగ్దమైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు. ఈ సంఘటనలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.
ప్రధాన రహదారి కావడంతో మంటలు చెలరేగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదురుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. షాప్ లో మంటలు వ్యాపించడంతో గమనించిన షాప్ సిబ్బంది వెంటనే బయటకు పరుగులు పెట్టడంతో ప్రమాదం తప్పింది.
దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆదిత్య మెడికల్ షాప్ మంటలు వ్యాపించడంతో పూర్తీగా దగ్ధం అయ్యింది.