ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య?
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య? ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు రావి చెరువులో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది, స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గపాడు గ్రామానికి చెందిన, పంతంగి కృష్ణారావు,(60) సీత (55) దంపతులు పిల్లలందరికీ వివాహం చేశారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణారావు కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి, దీంతో మనస్థాపానికి గురైన వృద్ధ దంపతులు చెరువులో శవమై కనిపించారు. …

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య?
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు రావి చెరువులో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది,
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గపాడు గ్రామానికి చెందిన, పంతంగి కృష్ణారావు,(60) సీత (55) దంపతులు పిల్లలందరికీ వివాహం చేశారు.
ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణారావు కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి, దీంతో మనస్థాపానికి గురైన వృద్ధ దంపతులు చెరువులో శవమై కనిపించారు.
ఈ రోజు తెల్లవారు జామున పొలానికి వెళ్తున్న రైతులు గ్రామానికి శివారు లోని రావి చెరువులో రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానికులు సహాయంతో బయటకు తీశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
