HealthKhammamPoliticalTelangana

ఖమ్మంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు

ఖమ్మంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు

ఖమ్మంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు

రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న డి యం & హెచ్ ఓ మరియు టాస్క్ఫోర్స్ సిబ్బంది

సి కె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డు నందు అన్నవరపు అంజిరెడ్డి సన్నాఫ్ వెంకట నరసింహారెడ్డి 45 సంవత్సరాలు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ తన ఇంట్లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఈరోజు జాయింట్ ఆపరేషన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, డాక్టర్ కళావతి భాయ్, ప్రోగ్రాం ఆఫీసర్ ఎంహెచ్ఎన్ డాక్టర్ సైదులు, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అక్రమంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నిందితుడు అన్నపురెడ్డి అంజిరెడ్డిని అతనితోపాటు అతని నిర్వహిస్తున్న స్కానింగ్ మిషన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.

నిందితుడిని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేయడం జరిగింది. స్కానింగ్ మిషన్ దానికి సంబంధించిన పరికరాలని పంచినామా చేసి సీజ్ చేయటం జరిగింది.

పిసి అండ్ పిఎన్డిటి యాక్ట్ 1994 చట్టం ప్రకారం నిందితుడికి పిసి పెయింట్ యాక్ట్ సెక్షన్ సిక్స్ చట్టరీత్యా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరంగా పరిగణించి అలాగే సెక్షన్ 23 సెక్షన్ నిర్ధారణ చేస్తున్న సక్షన్ 23 ప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 10 వేల రూపాయల వరకు ఫైన్ అలాగే సెక్షన్ 25 ప్రకారం అతడు స్కానింగ్ మిషన్ ని అనధికారికంగా పర్చేస్ చేసి ఇటువంటి అర్హత లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలకు పూనుకోపటం వల్ల సెక్షన్ 25 ప్రకారం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష లక్ష రూపాయలు అపరాధ రుసుము ఇది ఇచ్చే అవకాశం ఉంది.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ కళావతి భాయ్ మాట్లాడుతూ జిల్లాలో ఇలా అక్రమంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నిందితులని వదిలే ప్రసక్తే లేదని, వారిని దోషులు చట్టం ముందు నిలబెట్టి కఠినమైన శిక్షలు వేయించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ ఆపరే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఏసిపి టాస్క్ ఫోర్స్ ఏసిపి రవి కి మరియు వారి సిబ్బందికి అలాగే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మరియు సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button