
రూ.12,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసేరాల్ గ్రామానికి చెందిన గోసకుల రాజేశం అనే వ్యక్తి వద్ద వాటర్ ప్లాంట్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీ మర్రి శివ కృష్ణ
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
తన ఇంటి పక్క షెడ్డులో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ గ్రామ పంచాయతీకి అదే గ్రామానికి చెందిన ఓ రైతు దరఖాస్తు చేసుకున్నాడు.
వాటర్ ప్లాంట్ అనుమతి కోసం కొన్ని నెలలుగా పంచాయతీ సెక్రెటరీ (Panchayat Secretary) చుట్టూ తిరిగినా అనుమతి లభించలేదు. రూ.15వేలు లంచం ఇస్తేనే పనిచేసి పెడతానని సెక్రటరీ శివకృష్ణ తెగేసి చెప్పడంతో బాధితుడు పథకం ప్రకారం ఏసీబీని ఆశ్రయించారు.
ఒప్పందం మేరకు రూ.12 వేలు ముందుగా లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ (ACB) డీఎస్పీ మధు వలపన్ని పట్టుకున్నారు. చేతికి గులాబి రంగు పూసిన రూ.500 నోట్లను కార్యదర్శి శివకృష్ణకు ఇస్తుండగా పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు అధికార యంత్రాంగంలో అలజడి రేపుతున్నాయి.




