PoliticalTelanganaYadadri

గతంలో ఉండే హద్దురాలను తొలగించి దౌర్జన్యం చేస్తున్న వారిపై కఠిన చర్య తీసుకోవాలి

గతంలో ఉండే హద్దురాలను తొలగించి దౌర్జన్యం చేస్తున్న వారిపై కఠిన చర్య తీసుకోవాలి.

బాధితులు జోగు శంకరయ్య అంజయ్య.

సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు జూన్ 27.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామంలో జోగు చంద్రమ్మ కుమారులైనజోగు శంకరయ్య అంజయ్య మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ పట్టా భూమి 2014 సంవత్సరంలో సర్వే నంబరు 339 లో ఇద్దరికీ కలిపి ఆరు ఎకరాల 24 గంటల భూమి పట్టా కలదు ఇట్టి భూమికి హద్దులుగా గత 40 సంవత్సరాల క్రితం బండలు నాటి ఉన్నవి ఇట్టి బండలను కొందరు వ్యక్తులు బోయ శ్రీనివా సు బోయ బాబు మరియు బూడిదయాదయ్య లు అక్రమంగా మా పట్టా భూమిలోకి చొరబడి హద్దులుగా ఉన్న బండలను ధ్వంసం చేసి తరి పొలంలో కూడా బండలు పడవేసి కంప వేసిన ఇదేమిటని ప్రశ్నించగా పట్టాదారుడైన జోగు శంకరయ్య గారిని చంపుతామని బెదిరిస్తున్నారు. శంకరయ్య భార్యను అమ్మగారిని కూడా నానా బూతులు తిడుతూ వాళ్ల ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ బెదిరిస్తున్నారు,

మీరు ఈ ఊరిలో ఉండవద్దని చంపుతామని మారణాయుధాలతో బెదిరిస్తున్నారు, బోయ బాబు వైఫ్ ఆఫ్ లావణ్య కు ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయ్యిందని ముగ్గు పోయించడానికి హద్దులు తీసివేసినామని ఇంటి నిర్మాణాన్ని మా పట్టా భూమిలో నిర్మిస్తామని అక్రమంగా బెదిరిస్తూ ఊరి వీధులు సంచరిస్తున్నారు,

మాకు మా కుటుంబ సభ్యులకు ప్రాణహ ఉన్నదని పలుమార్లు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన పరిష్కారము దొరకలేదు,ఇకనైనా వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని పత్రికా ముఖంగా తమ గోడును తెలుగు పోసుకుంటూ మాట్లాడినారు,

గతంలో భూమి సర్వే చేసి పంచనామా కూడా చేసినారు గతంలో ఉన్న హద్దులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉండాలని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము మేము చట్టాన్ని గౌరవిస్తాము, దయచేసి హద్దులు సరిచేయాలని , రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, పోలీస్ సిబ్బంది స్పందించగలరని మీడియా ద్వారా తెలియజేస్తూ మాట్లాడినారు,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button