NationalPoliticalTelangana

జగన్నాథ రథ యాత్రలో అపశృతి… భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు!

జగన్నాథ రథ యాత్రలో అపశృతి… భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు!

జగన్నాథ రథ యాత్రలో అపశృతి… భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు!

గుజరాత్లోని గోల్వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర..

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవుళ్లు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంత కాలం గడుపుతారు.

తరువాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్​27న మొదలైన ఈ రథయాత్ర జులై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంది.

భద్రతా ఏర్పాట్లు..

పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అధికారులు 10,000 మంది భద్రతా సిబ్బందిని నియమించారు.

వీరిలో ఒడిశా పోలీసులు సహా సెంట్రల్ ఆర్మ్​డ్​ ఫోర్స్​ (సీఏపీఎఫ్)కు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. నిఘా కోసం పోలీసులు పూరీ పట్టణంలో 250కి పైగా ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​-ఎనేబుల్డ్ కెమెరాలు అమర్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button