PoliticalTelangana

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య…

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య…

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య…

నిజాంసాగర్ : భార్య కాపురానికి రావడం లేదని భర్త మానసిక వేదనతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన దేవళ్ల సాయిలు (30) అనే వ్యక్తికి భార్య సంగీత వీరికి కొడుకు, కూతురు ఇద్దరు సంతానం ఉన్నారు కాగా భార్య సంగీత భర్త సాయిలు తో గొడవపడి గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి గారి ఇంట్లో ఉంటుంది.

సాయిలు తన తల్లిదండ్రుల వద్ద వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కాపురానికి రావాలని చాలాసార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టిన రాకపోవడంతో మానసిక వేదనకు గురై చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button