NotificationPoliticalTelangana

వైద్యారోగ్యశాఖలో 2,322 ఉద్యోగాలు - దరఖాస్తులకు చేసుకోండి ఇలా!

వైద్యారోగ్యశాఖలో 2,322 ఉద్యోగాలు - దరఖాస్తులకు చేసుకోండి ఇలా!

వైద్యారోగ్యశాఖలో 2,322 ఉద్యోగాలు – దరఖాస్తులకు చేసుకోండి ఇలా!

ఇటీవలే 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను సర్కార్ జత చేసింది.

ఈ కొత్త పోస్టులు కలిపి మొత్తం 2,322 నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల గడువు దగ్గర పడింది. రేపటితో (అక్టోబర్ 14) ఈ ప్రక్రియ ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్లు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ దరఖాస్తులను అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించాలి.

అభ్యర్థులు తమ అప్లికేషన్లను అక్టోబర్ 16 ఉదయం 10.30 నుంచి 17వ తేదీ సాయంత్ర 5.00 వరకు సవరించుకోవచ్చు.
సీబీటీ విధానంలో పరీక్షను నవంబర్ 17, 2024 నిర్వహిస్తారు.

అర్హులైన అభ్యర్థు బోర్డు వెబ్‌సైట్‌ https://mhsrb.telangana.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం ఇలా….!

ఈ పోస్ట్‌లకు సంబంధించి పే స్కేల్ రూ.36,750 – రూ.1,06,990 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు(80 మార్కులకు పరీక్ష నిర్వహణ), మిగిలిన 20 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సేవలు(కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆసుపత్రులు/ సంస్థలు/ కార్యక్రమాలు) అందించిన వారికి కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుం….

ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ఈ కేటగిరీ కింద ఎలాంటి ఫీజు మినహాయింపు లేదు. దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200 చెల్లించారు. అయితే దరఖాస్తు రుసుముపై వివిధ వర్గాలకు మినహాయింపు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, తెలంగాణ మాజీ సైనికులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు. 18 నుంచి 46 సంవత్సరాల వయస్సు గల తెలంగాణకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

పోస్టుల వివరాలు…

పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు) పోస్టులు – 1576
తెలంగాణ వైద్య విధాన పరిషత్ స్టాఫ్ నర్స్ పోస్టులు – 332

ఆయుష్ స్టాఫ్ నర్స్ పోస్టులు – 61
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్టాఫ్ నర్స్ – 1
ఎంఎన్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ కేంద్రం స్టాఫ్ నర్స్ పోస్టులు – 80
మొత్తం పోస్టులు – 2050

కొత్త నోటిఫికేషన్ లో మరో 272 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అక్టోబర్ 11వ తేదీన వైద్యారోగ్యశాఖ తెలిపింది. వీటిని కలిపితే మొత్తం 2322 పోస్టులు కానున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button